దివ్యాంగులకు పెన్షన్ మంజూరు చేసేందుకు నిర్వహిస్తున్న సదరన్ క్యాంపులకు విశాఖలో స్లాట్లు దొరకగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ విశాఖ వాసులకు నర్సీపట్నం లేదా ఏజెన్సీ ప్రాంతంలో స్లాట్లు కేటాయించడంతో దివ్యాంగులను అక్కడికి తీసుకు వెళ్ళేందుకు పలు అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. సమస్యను పరిష్కరించాలన్నారు.