వాయు కాలుష్య నివారణకు చర్యలు
విశాఖ జిల్లాలో వాయు కాలుష్య నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. గాలి నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.