అచ్యుతాపురం: కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి

83చూసినవారు
అచ్యుతాపురం: కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి
అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపాలెంలో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని సీపీఎం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు జి కోటేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ ఆర్ రాము డిమాండ్ చేశారు. సోమవారం తిమ్మరాజుపేట సచివాలయం వద్ద పనులు కల్పించాలని ఉపాధి కూలీలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి నేతృత్వం వహించిన వారు మాట్లాడుతూ కుటుంబానికి ఏడాదిలో వంద రోజులు పని కల్పించాలని చట్టం చెబుతుందన్నారు.

సంబంధిత పోస్ట్