అచ్యుతాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

73చూసినవారు
అచ్యుతాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
అచ్యుతాపురం మండలం కుమారపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. రాంబిల్లి మండలం హరిపురం గ్రామానికి చెందిన ధూళి లోవరాజు బ్రాండిక్స్ కంపెనీలో డ్యూటీ ముగించుకొని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. కుమార పురం వద్ద ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టాడు. రోడ్డుమీద పడిపోయిన లోవరాజును మరో బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్