మునగపాకలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రసాద్ కార్యాలయం నుంచి సబ్స్టేషన్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తరువాత విద్యుత్ శాఖ అధికారులకు వినతి అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.