ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల కోసం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (2100 కోట్లు) మరియు వసతి దీవెన (1480 కోట్లు) డబ్బులు తక్షణమే విడుదల చేయాలని, నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.