AP: హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం తమది కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఆదివారం కౌంటర్ వేశారు. తోటి హీరోని అన్యాయంగా అరెస్ట్ చేస్తే 27 రోజులుగా నోరు విప్పకపోవడం మీ స్వభావమా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించకపోవడాన్ని పరోక్షంగా అంబటి కౌంటర్ వేశారు.