రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా రామ్‌చరణ్, దిల్‌రాజు ఇటీవల బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇందులో రామ్‌చరణ్ తన కుమార్తె క్లీంకార గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘మా పాప నాన్న అని పిలిచిన రోజు తప్పకుండా ఫొటో రివీల్ చేస్తాను’ అని తెలిపారు.