ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

59చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్