భీమిలి: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన
భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసిటిసి విభాగం ఆధ్వర్యాన సోమవారం విద్యార్థులకు హెచ్ఐవి/ఎయిడ్స్‌పై ”మీకు తెలుసా” పేరిట అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసిటిసి కౌన్సెలర్ రావి వెంకటరాజు మాట్లాడుతూ.. హెచ్ఐవి/ఎయిడ్స్ ఎలా వస్తుంది? వ్యాధి లక్షణాలను వివరించారు. సుఖ వ్యాధులు, వాటి లక్షణాలను వివరించారు. హెచ్ఐవి పరీక్ష ఎవరైనా చేయించుకోవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.