భీమిలి లో భారీ వర్షం

50చూసినవారు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో కుంభవృష్టి కురుస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి 87 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లాలో ఇదే అత్యధికం. భారీగా వర్షం కురుస్తుండడంతో రహదారులపై నీరు చేరింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్