భీమిలి సమీపంలోని మధురవాడ ఏరియాలో వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీపీఐ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మధురవాడ ఏరియా జోనల్ కమిషనర్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో విష సర్పాలు సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నట్లు తెలిపారు. అలాగే దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు.