పర్యాటక రంగానికి ప్రసిద్ధిగాంచిన విశాఖలో మరిన్ని వసతులు కల్పించాలని, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా విధానాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్రూయిజ్ టూరిజానికి అత్యిధిక ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. బుధవారం జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.