సీఎం సహాయనిధికి నెల జీతం విరాళం

73చూసినవారు
సీఎం సహాయనిధికి నెల జీతం విరాళం
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన పుట్టిన రోజున విపత్తుల సాయం కోసం సీఎం సహాయ నిధికి ఒక నెలజీతం విరాళం ప్రకటించారు. గురువారం ఆయన ఆ చెక్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం సహాయ నిధికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పునరావాస కార్యక్రమాలకు, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలకు ఈ నిధులు ఎంతో అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్