అక్కయ్యపాలెం: కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని విశాఖ జిల్లా సిపిఐ కార్యదర్శి ఎం. పైడిరాజు డిమాండ్ చేశారు. సోమవారం అక్కయ్యపాలెం జంక్షన్ లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకువచ్చామని ప్రభుత్వం చెబుతుందన్నారు. అయితే ఇసుక ఎక్కడా ఉచితంగా లభించలేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.