విశాఖలో ఆదివారం వనసమారాధన కార్యక్రమాలు సందడిగా జరిగాయి. నగరవ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల్లో పిక్నిక్లు జోరుగా జరిగాయి. వివిధ కుల సంఘాలు, స్నేహితులు, బంధువులు కార్తీక మాసం తొలి ఆదివారం వనసమారాధనలతో శ్రీకారం చుట్టారు. మురళీనగర్, విశాఖ జూ పార్కు, తొట్లకొండ, కంబాలకొండ, రుషికొండ ప్రాంతాల్లో వనసమారాధనలు జరిగాయి.