సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె. సురేష్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభం అలింగణం చేసుకొని గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండిత ఆశీర్వచనం ప్రధాన అర్చక స్వాములు ఇవ్వగా, ఆలయ ఈవో వి. త్రినాధరావు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.