కోటవురట్ల మండలంలో 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం మధ్యాహ్నం నుంచి తెరిపిచ్చిన వర్షం మళ్లీ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. లింగాపురం-కోడవటిపూడి రహదారిపై పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికుల పనులకు వర్షం ఆటంకం కలిగించింది.