2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కుల సాధించిన వారికోసంఆదివారం అనకాపల్లిలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఈవో వెంకట లక్ష్మమ్మ విద్యార్థులకు షీల్డ్ లను బహుకరించారు.కోటవురట్ల మండల స్థాయిలో 10వ తరగతిలో అత్యధిక మార్కుల సాధించిన వెంకటాపురానికి చెందిన తమరాన నేహాసిని షీల్డ్,ప్రశంసా పత్రం అందుకుంది. అనంతరం విద్యార్థులను పీఆర్టీయూ ప్రతినిధులు అభినందించారు.