మేఘాద్రిగెడ్డలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఆంధ్రప్రదేశ్ పూర్వ విద్యార్థుల సంఘం (స్వేరోస్) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, రోటరీ క్లబ్ మెట్రో ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు శనివారం పరీక్ష సామాగ్రిని అందజేశారు. రోటరీ క్లబ్ స్పీకర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదివితే విజయం సాధిస్తారని పదో తరగతి మొదటి మెట్టు అని, ఇక్కడి నుంచి జీవితానికి సంబంధించిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.