పెందుర్తి మండలం పురుషోత్తపురం హనుమాన్ ఆలయంలో మంగళవారం ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా జనసేన నాయకులు నమో నారాయణ పారాయణం నిర్వహించారు. నియోజకవర్గం జనసేన ప్రచార కమిటీ మెంబర్ ఉరిటి లక్కీ గోవింద్ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి కలిపి ఘోర అపచారం చేశారని అన్నారు. జరిగిన అపచారానికి భగవంతుడిని క్షమించమని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.