మెడికో హత్యను ఖండిస్తూ దోషుల్ని కఠినంగా శిక్షించాలని బుధవారం పరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట గాజువాక, ఎలమంచిలి మెయిన్ రోడ్డుపై సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.