ప్రకృతి విజయవాడ ప్రజలపై విలయ తాండవం చేసిందని మానవతా దృక్పథంతో ప్రజలందరూ ఆదుకొంటున్నారని సిపిఐ విశాఖ జిల్లా తరుపున మొదటి విడతగా రూ. లక్ష రాష్ట్ర పార్టీకి పంపామని జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు తెలిపారు. గురువారం విజయవాడ వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని పూర్ణమార్కెట్ ప్రాంతంలో విరాళాలు సేకరించారు.