విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ఎనికెపాడుల్లో కోడిపందేలు బుధవారం విచ్చలవిడిగా కోడి పందేలు నిర్వహించారు. ఈ బరుల్లో విఐపి ఎన్నారైల కోసం ప్రత్యేకంగా శిబిరాల ఏర్పాటు చేసి ఎంట్రీ ఫీజు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం, ఫుడ్ స్టాల్స్. పందేలు నిరాటంకంగా జరిగేందుకు రాత్రులు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి జోరుగా పందేలు నిర్వహించారు.