కొత్తపేటను నిర్వాసిత గ్రామంగా గుర్తించండి

84చూసినవారు
కొత్తపేటను నిర్వాసిత గ్రామంగా గుర్తించండి
రాంబిల్లి మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీని ఎన్ఏఓబి నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని కోరుతూ.. ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందర్పు విజయకుమార్ కు గురువారం అచ్చుతాపురం మండలంలోని ఎస్టి బిఎల్ నివాస సముదాయంలో గ్రామ సర్పంచ్ వానపల్లి వెంకట అరుణులత ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. కొత్తపేట గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించి ప్రజలకు జీవనోపాధి కల్పించాలన్నారు. చుట్టుప్రక్కల నిర్వాసిత గ్రామాలకు ఇచ్చినట్టుగానే తమకు ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్