జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి సుభాష్ పటాన్చెట్టి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు అందరూ ఓట్ల లెక్కింపు పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని కోరారు. సమస్యలుంటే శిక్షణా తరగతి సమయంలోనే నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రవి సుభాష్ పటాన్చెట్టి అన్నారు.