అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గురువారం ఉదయం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మంత్రి పయ్యావుల కేశవ్ జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ వినోద్ కుమార్. వి, ఎస్పీ కేవీ. మురళీకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.