గుత్తి: అనుమతులు లేని ఆసుపత్రి సీజ్

61చూసినవారు
గుత్తి స్థానిక తురకపల్లి రోడ్డులో ఉన్న శ్రీలక్ష్మి ఆసుపత్రిని మంగళవారం రాత్రి డీఎంహెచ్ డాక్టర్ భ్రమరాంబదేవి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఆర్ఎంపీ శేఖర్ శ్రీలక్ష్మి పేరుతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. దీనిపై పక్కా ఆధారాలతో కలెక్టర్కు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలో దిగిన డీఎంహెచ్ రెండు రోజులుగా విచారణ చేపట్టి ఎలాంటి అనుమ తులు లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్