ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి: ఏఐటియూసి

63చూసినవారు
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి: ఏఐటియూసి
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గుంతకల్లు పట్టణంలోని బిటి పక్కీరప్ప భవనంలో ఏఐటియూసి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 1, 2, 3తేదీలలో విశాఖలో జరిగే జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని అన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్