గుత్తి లో అండర్ 14, 17 స్కూల్ గేమ్స్

64చూసినవారు
గుత్తి లో అండర్ 14, 17 స్కూల్ గేమ్స్
గుత్తి పట్టణంలోని ఎమ్మెస్ ఫుట్ బాల్ క్రీడా మైదానంలో ఈనెల 20, 21 తేదీలలో అండర్-14, 17 స్కూల్ గేమ్స్ నిర్వహిస్తామని ఎంఎస్ హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు పుష్పరాలు చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్కూల్ గేమ్స్ లో భాగంగా బాల బాలికలకు వేర్వేరుగా ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్ తో పాటు యోగా పోటీలు నిర్వహిస్తామన్నారు. బాల, బాలికలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్