Apple ఉత్పత్తుల ప్రీమియం రీసెల్లర్ అయిన iPlanet, అనంతపూర్‌లో తన తాజా స్టోర్ ప్రారంభాన్ని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన అనంతపూర్‌లో బ్రాండ్ విస్తరణను ప్రారంభించింది. సాంప్రదాయ పద్ధతిలో రంగురంగుల అలంకరణలు, మరియు ఉత్సాహభరితమైన ప్రజలతో వాతావరణం సంతరించుకుంది. రిబ్బన్ కట్ చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు మరియు iPlanet ప్రతినిధులు పాల్గొన్నారు, ఈ స్టోర్ టెక్ ప్రియుల కోసం అందుబాటులో ఉన్నట్లు సూచించారు.
కొత్త iPlanet స్టోర్, iPhone లు, iPads, MacBooks మరియు యాక్సెసరీస్‌తో పాటు, నిపుణుల మార్గదర్శకత మరియు తర్వాతి సేవల మద్దతు అందించడమే కాక, ప్రీమియం షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.
iPlanet ప్రతినిధి మాట్లాడుతూ, " iPlanet అనుభవాన్ని అనంతపూర్‌కు తీసుకురావడంలో ఎంతో ఆనందంగా ఉన్నామన్నారు. ఈ స్టోర్ సేవలను మరింత విస్తరించడంలో దోహదపడుతుందన్నారు. ఈ స్టోర్ ప్రారంభం, Apple ఉత్పత్తులకు విస్తృతమైన ప్రాధాన్యతను ఇవ్వడమే కాక, అనంతపూర్ లో టెక్ ప్రేమికులు మరియు ప్రొఫెషనల్స్‌కు ఆదర్శవంతమైన గమ్యంగా మారిపోతుందన్నారు. ఈ స్టోర్‌లో, iPhone 16 ను కేవలం ₹1,699 నెలకు ఎక్స్చేంజ్ ద్వారా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 24 నెలల వరకు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ఆఫర్లు 22 నుండి 24 నవంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు..