ఈదురు గాలులకు నేలకూలిన వృక్షం

72చూసినవారు
ఈదురు గాలులకు నేలకూలిన వృక్షం
కళ్యాణదుర్గంలోని కోటవీధిలో భారీ ఈదురు గాలులకు ఓ పెద్ద వృక్షం శుక్రవారం రాత్రి నేలకొరిగింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో పెద్ద వృక్షం రహదారిపై కూలిపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకటి కావడంతో చెట్టును పక్కకు తొలగించడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ స్థానికులు రోడ్డుపై నుంచి వృక్షాన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించారు.

సంబంధిత పోస్ట్