
రాప్తాడు: దళితుల స్మశాన వాటికను కాపాడాలి
రాప్తాడు నియోజకవర్గం బసంపల్లి గ్రామంలో దళితుల స్మశాన వాటికను అగ్రవర్ణాలు ఆక్రమిస్తున్నాయని ఎస్సీ ఎస్టీ వర్గాల రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి చెప్పారు. బుధవారం ఆయన బసంపల్లి గ్రామస్తులతో కలిసి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. దళితులు చనిపోయినప్పుడు స్మశాన వాటిక లేక పోరాటం చేయాల్సి వస్తోందని, దాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.