తుంగభద్ర జలాశయం పది గేట్లు ఎత్తి నదికి నీటిని విడుదల

81చూసినవారు
తుంగభద్ర జలాశయం పది గేట్లు ఎత్తి నదికి నీటిని విడుదల
తుంగభద్ర జలాశయం నిండటంతో క్రస్ట్ గేట్ లను ఎత్తి నదికి నీటిని విడుదల చేస్తున్నారు. బోర్డు అధికారులు బుధవారం ఉదయం 10. 45 గంటలకు పది క్రస్ట్ గేట్లను ఎత్తి 30 వేల క్యూసెక్కులను నదికి వదిలారు. ఎగువ నుంచి 30, 419 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. డ్యాంకు మొత్తం 33 క్రస్టేట్లు ఉన్నాయి. ఇందులో 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడంతో స్టాప్లగ్ అమర్చారు. మిగిలిన 32 క్రస్ట్ గేట్లలో పదింటిని ఒక్కొక్క అడుగు ప్రకారం ఎత్తి నీటిని నదికి వదులుతున్నట్లు బోర్డు అధి కారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్