కృష్ణాజలాలు బీటి ప్రాజెక్టుకు తరలించే అంశంపై సీఎంను కలుస్తాం

56చూసినవారు
రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల జీవనాడి అయిన భైరవానితిప్ప(బీటీ) ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు పనులపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలసి కళ్యాణదుర్గంలో మాట్లాడారు. త్వరలో జరిగే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులను కలుస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్