పుట్లూరు: రైతుల సమస్యలపై ఎమ్మెల్యే శ్రావణికి వినతి

70చూసినవారు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని పుట్లూరు మండల సీపీఐ నాయకులు ఎమ్మెల్యే బండారు శ్రావణిని మంగళవారం రాత్రి కోరారు. అరటకవేముల గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. మండల కార్య దర్శి పెద్దయ్య మాట్లాడుతూ. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని, ఉపాధి పనులు రైతులకు అనుసంధానం చెయ్యాలని కోరారు.

సంబంధిత పోస్ట్