నార్పల: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
అనంతపురం జిల్లా నార్పలలో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణ కిషోర్ (45), శిరీష రాణి (35) అనే దంపతులు తమ ఐదు నెలల బాలుడితో కలిసి ఇంట్లో ఉరేసుకుని మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. త్వరలోనే ఘటనకు గల కారణాలను వెల్లడిస్తామని ఎస్ఐ సాగర్ తెలిపారు.