

బుక్కరాయసముద్రం: కార్యకర్తలతో చిందేసిన ఎమ్మెల్యే
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుక్కరాయసముద్రం నిలారెడ్డిపల్లిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేడుకల్లో జరిగిన సంబరాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె డ్యాన్స్ చేసి, వారిలో నూతనోత్సాహాన్ని నింపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరూ పార్టీ పాటలకు చిందులేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.