పెద్దవడుగూరు మండలంలోని బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలో ఉండాలని, పనిలో కాదని ఎంఈ ఓలు రాముడు, గురుప్రసాద్ సూచించారు. శుక్రవారం పెద్దవడుగూరు మండలంలోని కాశేపల్లిలో నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా వారు పర్యటించారు. డ్రాపౌట్ పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను గురించి వివరించారు.