పెద్దపప్పూరు మండలంలోని జె. కొత్తపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశం బుధవారం నిర్వహించామని ఎమ్మార్పీఎస్ అనంతపురము జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. ఆదినారాయణ మాదిగ తెలిపారు. ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నిర్మాణంలో భాగంగా సమావేశం నిర్వహించి అనంతరం అధ్యక్షులుగా అనిల్ మాదిగ, ఉపాధ్యక్షులుగా సుదర్శన్ మాదిగ, ఆదినారాయణ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయులు, తదితరులను ఎన్నుకున్నామని తెలిపారు.