పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు జెడ్పీహెచ్ఎస్ లో పదో తరగతి చదువుతున్న రాజశేఖర్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే ఏపీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈనెల 13నుంచి 15వతేదీ వరకూ అన్నవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న రాజశేఖర్ తనదైన ఆటతీరుతో సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకుని ఏపీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 25న హర్యానాలోని రోతక్ జిల్లాలో జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి.