తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

2565చూసినవారు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా సోషల్ మీడియా వ్యక్తి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో తెదేపా నాయకులు అభ్యంతరం తెలిపారు. తాము కూడా వెళ్తామంటూ పోలీసులను నిలదీశారు. ఈ నేపథ్యంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు ఆర్వో కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్