తాడిపత్రి: ఆర్టీసీ సమస్యలపై నేడు డయల్ యువర్ డీఎం
తాడిపత్రిలోని ఆర్టీసీ బస్టాండ్లో నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్ శుక్రవారం పేర్కొన్నారు. తాడిపత్రి పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికులు ఏమైనా సమస్యలు, సూచనలు, సలహాలు ఉంటే 9959225856 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.