తాడిపత్రి: కళాశాలపై చర్యలకు జేసీ డిమాండ్

55చూసినవారు
తాడిపత్రి పరిసరాల్లో ఉన్న సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో గతంలో ఒకరి స్థానంలో ఒకరు పరీక్షలు రాశారని దీనికి యాజమాన్యం సహకరించిందన్నారు. అక్రమాలపై న్యాక్ బృందం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని అక్రమాలపై డీఎస్పీ, ఇంటిలిజెన్స్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్