తాడిపత్రి: ఐదు మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

65చూసినవారు
తాడిపత్రి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని ఆర్టీవో ఆఫీస్ వెనకాల సపోటా తోటలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ 44, 600/-నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు. మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100కు లేదా రూరల్ పోలీసులకు తెలియజేయాలని సీఐ సూచించారు.

సంబంధిత పోస్ట్