కాలువలో పూడికతీత పనులు

81చూసినవారు
కాలువలో పూడికతీత పనులు
గడేకల్లు గ్రామం వద్ద ఉన్న జి. బి. సి (గుంతకల్లు బ్రాంచ్ కెనాల్) పరిధిలోని 3వ కాలువలో పూడిక తీత పనులను టీడీపీ నాయకులు బుధవారం ప్రారంభించారు. రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందివ్వాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు జారీ చేశారని, దీంతో 9 వ కాలువలో పూడిక తీత పనులను చేపట్టామని నాయకులు తెలిపారు. గత వైసీపీ పాలనలో 9వ కాలువకు సాగు నీరు అందక రైతులు వేల ఎకరాలు బీళ్లు పెట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్