అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీంకు ఇరాన్ లో జరిగే ఆసియా మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. దీంతో బుధవారం మేయర్ వసీం ఇరాన్ దేశం రాజధాని తెహరాన్ చేరుకున్నారు. అక్కడ తెహరాన్ మున్సిపల్ అధికారులు మేయర్ వసీం కు ఘనంగా స్వాగతం పలికారు. సదస్సులో గురువారం మేయర్ వసీం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మున్సిపల్ అధికారులు కూడా పాల్గొన్నారు.