విద్యార్థుల సమస్యలను పరిష్కరించిన బీజేపీ జాతీయ కార్యదర్శి

734చూసినవారు
విద్యార్థుల సమస్యలను పరిష్కరించిన బీజేపీ జాతీయ కార్యదర్శి
ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కేంద్రాల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశ పరీక్ష కి సంబంధించి చెన్నై కేంద్రంగా కేటాయించడం తో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర గిరిజన విద్యార్థులు ప్రవేశ పరీక్ష కేంద్రం కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని బిజెపి జాతీయ కార్యదర్శివై సత్య కుమార్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

వెంటనే స్పందించిన సత్య కుమార్ సంబంధిత హెచ్ ఆర్ డి మినిస్టర్ డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిశాంక్ దృష్టికి తీసుకెళ్లడం వెనువెంటనే దీనిపై స్పందించిన సంబంధిత మంత్రిత్వ శాఖ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ తో మాట్లాడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కో ప్రవేశ పరీక్ష కేంద్రాలను కేటాయించడం జరుగుతుందని వారు తెలపడం తో తమ సమస్యను పరిష్కరించినందుకు గాను గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సత్యకుమార్ కి ధన్యవాదాలు తెలియజేసి హర్షాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్