అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ మహాత్మా గాంధీ చిత్రపటానికి బుధవారం నివాళులర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ చూపిన అహింస బాటలో నడవాలని కోరారు.