బుక్కరాయసముద్రాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
బుక్కరాయసముద్రం మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణ స్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు లేక వేసిన పంటలు ఎండి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున బుక్కరాయసముద్రం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు.